ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్.. సీనియర్ నేత రాజీనామా!

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతూనే ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ కేవలం 11 సీట్లకి మాత్రమే పరిమితమై అధికారానికి దూరమైన విషయం తెలిసిందే. దీంతో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు వరుసగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు.

ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు, సీనియర్లు పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి. ఈ క్రమంలో తాజాగా ఏలూరులో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. జిల్లాలో సీనియర్ నేత అయిన గంటా ప్రసాద్ రావు పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా పార్టీ వైసీపీ సభ్యత్వానికి, జిల్లా వైసీపీ బీసీ సెల్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు.

రాజీనామా పత్రాన్ని మాజీ సీఎం జగన్ కి పంపించారు. గంటా ప్రసాద్ రావు టిడిపి లేదా జనసేనలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఆయన భార్య గంటా పద్మ శ్రీ ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో ఆమె కూడా వైసిపికి రాజీనామా చేయనున్నారు అనే ప్రచారం వినిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version