చూస్తుంటే అధికారులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది : వర్ల రామయ్య

-

మరోసారి వాలంటీర్లపై విమర్శలు గుప్పించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. అయితే.. ఇవాళ వర్ల రామయ్య.. సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ తరపున వార్డు వాలంటీర్లు యదేచ్చగా ప్రచారం చేస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ప్యాపిలీ 2 వ వార్డు ఎన్నికల్లో వాలంటీర్లు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు వర్ల రామయ్య. ఎన్నికల సంఘం ఆదేశాలను, నియమనిబంధనలను యదేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు అని ఫిర్యాదులో వర్ల రామయ్య పేర్కొన్నారు. ఇది కేవలం ఒక్క సంఘటన మాత్రమే కాదు.. ఇటువంటివి రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి అని మండిపడ్డారు వర్ల రామయ్య.

విజయనగరం జిల్లా పెంటశ్రీరాంపురం సర్పంచ్ ఎన్నికల్లో సైతం గ్రామ వాలంటీర్లు, వీఆర్‌ఏ, కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింట్ ఉద్యోగులు వైసీపీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు అని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె పంచాయతీలో సైతం వాలంటీర్లతో సహా అంగన్‌వాడీ, ఆశావర్కర్లు వైసీపీకి ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు వర్ల రామయ్య. నిబంధనలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించలేకపోవడం చూస్తుంటే అధికారులు వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని వర్ల రామయ్య అన్నారు. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా తక్షణం ఆదేశాలు జారీ చేయండి అని వర్ల రామయ్య కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలలు సజావుగా జరగాలంటే మీరు తక్షణం చర్యలు తీసుకోండి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు వర్ల రామయ్య.

Read more RELATED
Recommended to you

Exit mobile version