ములుగు కలెక్టరేట్‌లో బీసీ లబ్ధిదారులకు లక్షా ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వెనుకబడ్డ తరగతుల వారిని వృత్తిపరంగా ఆదుకునేందుకు ఉద్దేశించిన బీసీ బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. వ్యాపారాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి ఆర్థికంగా ఎదగాలని సూచించారు మంత్రి సత్యవతి రాథోడ్. ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో 16 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, ఆస్తి , పంట నష్టం తీవ్రంగా జరిగిందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామస్తులు వరదల్లో చిక్కుకొని మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశామని వెల్లడించారు మంత్రి సత్యవతి రాథోడ్.
కొండాయి, బూర్గుపేట, మల్యాల దొడ్ల, గ్రామాల ప్రజలకు ఇండియన్ ఆయిల్ సంస్థ ఆధ్వర్యంలో బాధిత కుటుంబాలకు 10 లక్షల విలువగల 19 రకాల సరుకులతో కూడిన వెయ్యి కిట్లను మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. అనంతరం ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య బాగుపడేలా జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని మంజూరు సంతోషించదగిన విషయమని అన్నారు . ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్ కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్ ఆలం, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్ నాయక్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు పళ్ళ బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.