విజయవాడ సబ్ జైలులో వంశీకి ప్రాణహాని ఉంది – పంకజ శ్రీ

-

విజయవాడ సబ్ జైలులో వంశీకి ప్రాణహాని ఉందని వల్లభనేని వంశీ సతీమణీ పంకజ శ్రీ బాంబ్‌ పేల్చారు. వల్లభనేని వంశీని ములాఖత్ తో కలిసిన అనంతరం మీడియాతో వంశీ భార్య మాట్లాడారు. విజయవాడ సబ్ జైలులో వంశీకి ప్రాణహాని ఉంది, ఆయనకు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారని వెల్లడించారు.

Vamsi’s satimani Pankaja Sri bombed Vallabhane when Vamsi was in danger of life in Vijayawada Sub Jail

వంశీ గారికి టెయిల్‌బోన్ సర్జరీ జరిగింది, కోవిడ్ తర్వాత శ్వాస సమస్య ఉందని పేర్కొన్నరాఉ. ఆయనను 22 గంటలు ఒక పనిష్‌మెంట్‌లా ఒక షెల్‌లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహించారు పంకజ శ్రీ. ఇక అటు గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. తాజాగా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఫోన్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు… ఆయన ఫోన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news