రోజా వి గ్లిజరిన్, మహానటి ఏడుపులు – వంగలపూడి అనిత

-

రోజావి గ్లిజరిన్, మహా నటి ఏడుపులు అంటూ చురకలు అంటించారు తెలుగు మహిళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం లో తెలుగు మహిళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ…రోజా తిట్ల పురాణం, హావభావాలు ఎవరు మరిచిపోయిన గూగుల్ నుంచి ఎక్కడకు పోలేదని ఫైర్‌ అయ్యారు.

vangalapudi anitha press meet on roja comments
vangalapudi anitha press meet on roja comments

పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ సహా కుటుంబ సభ్యులపై వివిధ సందర్భాలలో చేసిన కామెంట్స్ ఆడియోలు విడుదల చేశారు. అసెంబ్లీ సాక్షిగా సహచర ఎమ్మెల్యేలమైన నా పైన, అప్పటి మంత్రి పీతల సుజాతపై మాట్లాడిన రోజాకు ఇప్పుడు ఆడతనం గుర్తుకువచ్చి., కన్నీళ్లు వస్తున్నాయా…? అని మండిపడ్డారు. NTR ఫ్యామిలీ గురించి అనుచితంగా మాట్లాడినందుకే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో రోజా ఏడుపులు ఎవరు స్పందించలేదు…. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైన్ షాపుల ముందు మద్యం సీసాలు పగులగొట్టిన రోజా, వాసిరెడ్డి పద్మ లు కల్తీ మద్యంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news