మేకపాటి విక్రమ్ రెడ్డిపై జాతీయ గిరిజన కమిషన్‌కు వర్ల రామయ్య ఫిర్యాదు..

-

జాతీయ గిరిజన కమిషన్‌కు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఆత్మకూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ వెంకట రమణమ్మను అవమానించారని ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. జగన్ పాలనలో కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతోందని.. ఆత్మకూరు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి తన పత్రికా సమావేశం గిరిజన మహిళపై కులవివక్షకు పాల్పడ్డారని వివరించారు.

ఈ మేరకు జాతీయ గిరిజన కమిషన్‌కు లేఖ రాశారు వర్ల రామయ్య. యానాది కులానికి చెందిన ఆత్మకూరు మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ వెంకట రమణమ్మను పత్రికా సమావేశంలో నిలబెట్టి అవమానించారని.. ఆత్మకూరుకు ప్రధమ మహిళ వెంకట రమణమ్మను గిరిజన మహిళ అయినందుకే ఎమ్మెల్యేలతో సమానంగా గౌరవించలేదని ఆగ్రహించారు.

గిరిజన మహిళను నిలబెట్టి అవమానించడం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘించడమేనని.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్ -3 ప్రకారం శిక్షార్హం అన్నారు. శాసనసభ సభ్యుడిగా ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి చట్టాలను ఉల్లంఘించడం దారుణం అని.. పత్రికా సమావేశం ఏర్పాటు చేసిన వారిపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించండని కోరారు. సామాజికంగా వెనుకబడిన అణగారిన వర్గాల వారి హక్కులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోండని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version