లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు: మంత్రి రజిని

-

స‌మాజానికి ఎంతో కీల‌కంగా ఉన్న ప్రీ క‌న్సెప్ష‌న్ అండ్ ప్రీ నాట‌ల్ డ‌యాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ (పీసీపీఎన్ డీటీ), స‌రోగ‌సీ చ‌ట్టాల విష‌యంలో అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని గారు తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం ప్రీ క‌న్సెప్ష‌న్ అండ్ ప్రీ నాట‌ల్ డ‌యాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్ (పీసీపీఎన్ డీటీ), స‌రోగ‌సీ చ‌ట్టాల రాష్ట్ర‌స్థాయి అమ‌లు బోర్డుల స‌మావేశాల‌ను నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ లింగ‌నిర్థార‌ణ ప‌రీక్ష‌లు ఎలా జ‌ర‌గుతున్నాయ‌నే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల ప‌ర్య‌వేక్ష‌ణ ఉండాల‌ని చెప్పారు. ఈ విష‌యంలో రాష్ట్ర వ్యాప్తంగా డెకాయ్ ఆప‌రేష‌న్లు నిర్వ‌హించాల‌ని చెప్పారు. ఎక్క‌డా కూడా పుట్ట‌బోయే బిడ్డ ఎవ‌రో చెప్పే ప‌రిస్థితులు ఉండ‌టానికి వీల్లేద‌న్నారు. లింగ‌నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చ‌ట్ట రిత్యా నేరం అని తెలిపేలా అన్ని ఆస్ప‌త్రులు, స్కానింగ్ సెంట‌ర్ల‌లో గోడ‌ప‌త్రిక‌లు ఏర్పాటుచేయాల‌ని సూచించారు. ప్ర‌జ‌ల్లో కూడా ఈ విష‌యంపై అవ‌గాహ‌న పెంచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అవ‌స‌ర‌మైతే ఏఎన్ ఎంలు, ఆశా వ‌ర్క‌ర్ల‌కు ప్ర‌త్యేకంగా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌న్నారు.

 

ఐవీఎఫ్‌, స‌రోగ‌సి లాంటి ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను అవ‌లంబిస్తున్న ఆస్ప‌త్రుల విష‌యంలో అధికారులు నిఘా ఉంచాల‌ని చెప్పారు. అనుమ‌తులు లేకుండా స‌రోగ‌సి లాంటి చికిత్స‌లు అందిస్తున్న ఆస్ప‌త్రుల‌పై క‌ఠినంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్ ఆస్ప‌త్రుల లైసెన్సుల‌ను త‌నిఖీ చేయాల‌ని, ఆయా ఆస్ప‌త్రుల‌పై కూడా త‌రుచూ త‌నిఖీలు జ‌ర‌గాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version