100 రోజుల పాలనలో చంద్రబాబు స్ట్రైక్ రేట్ జీరో – విజయసాయి

-

100 రోజుల పాలనలో చంద్రబాబు స్ట్రైక్ రేట్ జీరో అంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు పేల్చారు. ఏపీలో పాలన వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్! ఏపీకి తిరిగి ఊపిరి తీసిన ఎవరికి ఎన్ని మార్కులు..? అంటూ ప్రశ్నించారు. 100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా అని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, తీవ్ర అసంతృప్తి చెందారా..? అని విజయసాయి ప్రశ్నించారు.

vijayasai on tdp 100 days ruling

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందిందని ఆగ్రహించారు. 40 సంవత్సరాల ఇండస్ట్రీగా స్వయంప్రకటిత చంద్ర బాబుకు IAS, IPS బదిలీల్లో కులప్రాతిపదికే ప్రామాణికంగా జరిగాయన్న విమర్శలు ఎందుకు వచ్చాయి..? అని నిప్పులు చెరిగారు. అసంతృప్తితో రగిలిపోతున్న కూటమి నేతలను పట్టించుకోవడం లేదా అని సెటైర్లు పేల్చారు. విపత్తు నిర్వహణలో పూర్తి వైఫల్యం అనిపించుకున్న చంద్రబాబు స్ట్రైక్ రేట్ ఎంత? ఆరంభమే ప్రభుత్వ వ్యతిరేకత ఎందువల్ల! ప్రజలదే అంతిమ నిర్ణయమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version