చంద్రబాబుకు తెలంగాణ-రాయలసీమ అంటే ఇష్టం ఉండదని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చురకలు అంటించారు. చంద్రబాబు నాయుడు అరిచి గీపెట్టినా. విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని రావడం ఖాయమన్నారు. అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్న నగరం విశాఖ అని.. చంద్రబాబు నాయుడుకు ఆ రెండు మూడు జిల్లాలలు మినహా ఇతర ప్రాంతాల అంటే ద్వేషమని నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాయలసీమ అంటే ఇష్టం ఉండదని.. మూడు రాజధానులు అంటే చంద్రబాబునాయుడుకు ద్వేషం ఎందుకో ? అని నిలదీశారు.
చంద్రబాబు నాయుడు కి తన సొంత కూమారుని పై నమ్మకం లేకపోవడంతో దత్తపుత్రుడు పై ఆశలు పెట్టుకున్నారు.. దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ పై కూడా ప్రజలకు విశ్వాసం లేదని ఫైర్ అయ్యారు. వైయస్సార్… జగన్మోహన్ రెడ్డి ల హయాంలో వ్యవసాయ రంగానికి జరిగిన అభివృద్ధి ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. చంద్రబాబు నాయుడు కరెంటు తీగలపై బట్టలు ఆరబెట్టుకోవాలని విమర్శించారు.. టిడిపి హయాంలో వేలాది ఎకరాల భూములను ఒకే సామాజిక వర్గం దోచుకున్నారన్నారు. విశాఖలో టీడీపీ హయాంలో ఆక్రమణలకు గురైన ఐదు వేల కోట్ల విలువైన భూములను మూడు సంవత్సరాలలో స్వాధీనం చేసుకున్నామని.. వైయస్సార్ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఆక్రమిత భూముల విలువ మార్కెట్ లో అయిదు రెట్లు ఉంటుందని వెల్లడించారు.