ఆంధ్రప్రదేశ్‌ భారీగా పెరిగిన గ్రీన్‌ మొబిలిటీ – విజయసాయిరెడ్డి

-

ఆంధ్రప్రదేశ్‌ భారీగా గ్రీన్‌ మొబిలిటీ పెరిగిందన్నారు విజయ సాయిరెడ్డి. నాలుగేళ్ల క్రితం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచీ ఆంధ్రప్రదేశ్‌ లో గ్రీన్‌ మొబిలిటీకి ప్రాధాన్యం పెరిగింది. ఎలెక్ట్రిక్‌ వాహనాల తయారీ, వాటికి అవసరమైన బ్యాటరీలు, చార్జింగ్‌ పరికరాలు ఉత్పత్తి విస్తరించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని సర్కారు ఏటా ప్రోత్సాహకాలు ప్రకటాస్తూ గట్టి ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఎలెక్ట్రిక్‌ (గ్రీన్‌) మొబిలిటీకి తగిన వ్యవస్థ, వాతావరణం ఏర్పాటు చేయడానికి గతంలోనే ఈ రంగంలో అనుభవం ఉన్న ‘ఊర్జా గ్లోబల్‌’ అనే కంపెనీతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఏపీఈడీబీ) ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. ఈ అవగాహన ఒప్పందం ప్రకారం లిథియం–అయాన్‌ బ్యాటరీలు, ఎలెక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్లు ఏపీలో ఏర్పాటవుతాయి. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఊర్జా గ్లోబల్‌ రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే పరిశ్రమల వల్ల 250 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలుంటాయని అప్పుడు అంచనా వేశారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ను ఎలెక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) తయారీ కేంద్రంగా చేయడానికి వరల్డ్‌ ఇకనామిక్‌ ఫోరమ్‌ తో కలిసి ఏపీ సర్కారు కిందటేడాది ఆగస్టులో ఏర్పాటు చేసిన తొలి వర్చ్యుల్‌ మీటింగ్‌ విజయవంతంగా జరిగింది. విద్యుత్‌ వాహనాల రంగంలో ఇతర రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తుందని ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి ఆయోగ్‌ సలహాదారు సుధేందు సిన్హా విశ్వాసం ప్రకటించారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పెరుగుతున్న సాంప్రదేయేతర ఇంథన వనరుల ఉత్పత్తి కారణంగా ఎలెక్ట్రిక్‌ వాహనాల రంగం విస్తరణకు అనువైన వాతావరణం ఉందని అందరూ గుర్తిస్తున్నారన్నారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version