కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీకి కేటీఆర్‌ శంకుస్థాపన

-

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన ప్రారంభమైంది. బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్ చేరుకున్న కేటీఆర్.. అక్కడి నుంచి రోడ్డు మార్గాన గీసుకొండ మండలంలోని శాయంపేటలో ఉన్న కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు చేరుకున్నారు. ఈ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీఎవర్‌ టాప్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం కంపెనీ ప్రతినిధులు, పార్కులో వస్త్ర పరిశ్రమలను నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్‌ ప్రావీణ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.

టెక్స్‌టైల్‌ పార్కులో యంగ్‌వన్‌ కంపెనీకి ఇటీవల 298 ఎకరాలను కేటాయించింది. తమ వస్త్ర పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగం కల్పించనున్నట్లు సౌత్‌కొరియాకు చెందిన యంగ్‌వన్‌ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. యంగ్‌వన్‌ కంపెనీ టెక్స్‌టైల్‌ పార్కులో రూ.840 కోట్ల పెట్టనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version