మోదీ సర్కారుపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మణిపూర్ అంశంపై సమాధానం చెబుతానని హోంమంత్రి అమిత్ షా చెప్పారని విజయసాయి తెలిపారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలను మణిపుర్ అంశం అట్టుడికిస్తోంది. ఈ వ్యవహారంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాల్సిందేనని విపక్ష కూటామి ఇండియా పట్టుబడుతోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వంపై ‘అవిశ్వాస తీర్మాన ’ అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. లోక్‌సభ లో కాంగ్రెస్ డిప్యూటీ నేత గౌరవ్ గొగొయ్.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్ నేత మాణికం ఠాగూర్ వెల్లడించారు. అటు బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు.