వాడేసిన అండర్‌వెయిర్లు, కట్ చేసిన గోళ్లు అమ్ముకోని లక్షలు సంపాదిస్తున్న మహిళలు..!

-

చాలా మంది డబ్బు సంపాదించడం చాలా కష్టం అనుకుంటారు. కానీ కొంతమందిని చూస్తే ఇంత తేలికా అనిపిస్తుంది. అంత అవలీలగా డబ్బులు సంపాదించేస్తారు. మొన్నా మధ్య ఓ యువతి.. అపానవాయువు అమ్ముకోని కోట్లు సంపాదించింది. అయితే ఇంతకుముందు మహిళలు మోడలింగ్ ద్వారా డబ్బు సంపాదించే చోట, ఇప్పుడు ఇంట్లో కూర్చొని మోడలింగ్ చేస్తున్నారు. తమ ఇంట్లోని గదిలోంచి తమ ఫొటోలు, వీడియోలు సోషల్ సైట్లు ద్వారా అమ్మి లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు. ఇవే కాకుండా కొందరు మహిళలు ఉపయోగించిన లోదుస్తులను విక్రయిస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అవునండీ.. కొంతమంది మహిళలు వాడేసిన అండర్‌వేయిర్‌ అమ్ముకోని డబ్బు సంపాదిస్తున్నారు. అసలు వాడేసినవి ఏం చేసుకుంటారు..? మనం వాటిని పారేస్తాం.. వాళ్లు ఎలా అబ్బా పైసలు సంపాదిస్తున్నారు.?

బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో, డబ్బు సంపాదించడానికి ప్రజలు కూడా వివిధ మార్గాలను వెతుకుతున్నారు. మెలిస్సా కుక్ అనే సెక్స్ థెరపిస్ట్ మాట్లాడుతూ.. ఉపయోగించిన లోదుస్తులను విక్రయించి మహిళలు సులభంగా డబ్బు సంపాదిస్తున్నారని చెప్పారు. ఈ వ్యాపారం ద్వారా బ్రిటన్‌లో వీరికి ప్రతి నెలా 30 వేల నుంచి 4 లక్షల రూపాయల ఆదాయం వస్తోందని అంటున్నారు.

ఇందులో ఉపయోగించిన షార్ట్‌లు, సాక్స్, లోదుస్తులు,అండర్ వేర్లు ఉన్నాయి. అయితే డబ్బు సంపాదనకు ఇలాంటి మార్గాలను అనుసరించడం ఇదే మొదటిసారి కాదు. కంటెంట్ విక్రయ సైట్‌లలో ఇటువంటి వింత డిమాండ్‌లను కలిగి ఉన్న అనేక మంది కస్టమర్‌లు ఉన్నారు. మహిళలు కోసిన గోళ్లు, వెంట్రుకలు, బట్టలను లక్షలకు విక్రయిస్తుండగా, వాటిని కొనుగోలు చేసే వారికి కొరత లేదు. వీటిని ఆన్‌లైన్‌ ద్వారానే విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ కూడా రూపొందించి మరీ ఈ వాడేసిన వస్తువులను విక్రయిస్తున్నారు.

ఎవర్రా మీరు మరీ ఇలా ఉన్నారు అనుకుంటున్నారా..? ఈ లెక్కన చూస్తే మనం ఇవి అన్నీ వేస్ట్‌గా పడేస్తున్నాం కదా..! జనాలకు ఎప్పుడు ఏది నచ్చుతుందో చెప్పలేం.. ఆఖరికి కట్‌ చేసిన గోళ్లతో ఏం చేసుకుంటారో.. వాటిని కూడా లక్షలు పోసి కొంటున్నారు.!

బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం పెరగడంతో.. అక్కడి ప్రజలు పొదుపు మార్గాలను అన్వేషిస్తున్నారు. ఖర్చులు తగ్గించుకుంటున్నారు. బయట తినడం మానేసి ఇంట్లోనే వండుకుంటున్నారు. నిత్యవసరాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version