పవన్ కళ్యాణ్ కాళ్లు మొక్కిన నారా లోకేష్ ఈరోజు పవన్ కళ్యాణ్ ఇచ్చే ఆదేశాలను అమలు చేయవద్దని అధికారులకు చెబుతున్నారు అని విజయసాయిరెడ్డి అన్నారు. తన కుమారుడిని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడదామని చంద్రబాబు చాలా సిస్టమెటిగ్గా కాపులను, పవన్ కళ్యాణ్ ను డి గ్రేట్ చేస్తున్నారు. చంద్రబాబును కలిసిన గంట తర్వాత మందకృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అయితే మందకృష్ణ మాదిగ పవన్ కళ్యాణ్ ని విమర్శించాడు అంటే అది చంద్రబాబు మార్క్ రాజకీయం అని తెలిపారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ను కూటములో లేకుండా చేస్తారు. పవన్ కళ్యాణ్ అనే నాయకుడు కూటమిలో ఉంటే చంద్రబాబు నాయుడు తన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయలేడు. రాష్ట్రంలో 20 శాతానికి పైగా కాపులు ఉన్నారు, ఇంత బలమైన వర్గాన్ని ఎదుర్కోవాలి అంటే కష్టం కాబట్టి ఒక ప్రణాళిక బద్దంగా కాపులని పవన్ కళ్యాణ్ ని బలి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.