పదో తరగతి పేపర్ల లీకేజీపై రాజ్యసభ సభ్యులు, వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. పేపర్ల లీకును ‘సేవ’గా గుర్తించి పద్మశ్రీ ఇవ్వాలా ఏంటి బాబూ? అంటూ చంద్రబాబుపై సెటైర్లు పేల్చారు విజయసాయిరెడ్డి. నీ అండతో అతిపెద్ద ఎడ్యుకేషన్ మాఫియాను సృష్టించి లక్షలాది మంది పిల్లల జీవితాలతో ఆడుకున్న లీకు వీరుడు నారాయణను అరెస్ట్ చేస్తే ఎందుకు ఎగిరెగిరి పడుతున్నావు ? అని నిప్పులు చెరిగారు.
ర్యాంకుల కోసం రేయింబవళ్లు నారాయణ యాజమాన్యం పెట్టే వత్తిళ్లను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆక్రందనలు నీకు వినబడలేదా బాబూ ? అని మండిపడ్డారు. అందుకేనా ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనను మంత్రిని చేసింది ? ఫైర్ అయ్యారు.
చంద్రబాబు సలహాలు అమలు చేసినందుకు శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స రాజీనామా చేయాల్సి వచ్చిందని… ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విపక్ష నాయకుడు కూడా ముందుకు రాలేదని పేర్కొన్నారు. గతంలో అమెరికాలో పార్టీ పెడితే టీడీపీ గెలుస్తుందన్నాడు పప్పు నాయుడు అని. ఇప్పుడు శ్రీలంకలో ట్రై చేస్తే అంతర్జాతీయ పార్టీ అవుతుందని చురకలు అంటించారు.