ఆ యుముడికి కూడా వెన్నుపోటు పొడుస్తాడంటూ చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. ప్రపంచం ఎంతో మారింది. కానీ చంద్రబాబు మారడంటూ ఆగ్రహించారు. పుట్టిన దగ్గర నుండీ అవే అబద్ధాలు, అవే మోసాలు అన్నారు.
జ్ఞానం కలగాల్సిన వయస్సులో కూడా ఏమాత్రం సంకోచించక, వెనకాడకుండా పాపాలు చేస్తూనే వున్నాడని నిప్పులు చెరిగారు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి. నరకం ఇతనికి చాలదు…యముడు ప్రత్యేక లోకాన్ని సృష్టించాల్సిందే. ఆ యముడ్ని కూడా తప్పు దారి పట్టిస్తాడేమో అంటూ చురకలు అంటించారు వైసీపీ ఎంపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి. పైశాచిక పోస్టులతో అమ్మ, అక్క, ఆలి అంటూ చెలరేగిపోతున్న టీడీపీ సైకోలకు చెక్ పెట్టాల్సిన అవసరం లేదా? అంటూ ఆగ్రహించారు. కష్టాలు కొత్తేం కాదు.. గతం లో ఉన్నాయి..ఇప్పుడు ఉన్నాయి…పోరాడుతాం….మళ్ళీ గెలుస్తాం….టీడీపీకి బుద్ధి చెపుదామని ట్వీట్ చేశారు.