డొనాల్డ్ ట్రంప్‌, కమలాహ్యారిస్‌కు రాహుల్‌ గాంధీ లేఖ..

-

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ డొనాల్డ్ ట్రంప్‌, కమలాహ్యారిస్‌లకు లేఖ రాశారు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా ట్రంప్ నాయకత్వంలో ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించారు. ‘అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్‌ ట్రంప్‌నకు అభినందనలు. భవిష్యత్తు కోసం ప్రజలు మీ విజన్‌పై విశ్వాసం ఉంచారు. మీ నాయకత్వంలో పరస్పర ప్రయోజనాల కోసం ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని విశ్వసిస్తున్నాం’ అని లేఖలో పేర్కొన్నారు.

ఇక అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌‌కు రాసిన లేఖలో.. అధ్యక్ష ఎన్నికలకు ఆమె కృషిని అభినందించారు.‘అధ్యక్ష ఎన్నికల్లో మీ ఉత్సాహంతో కూడిన ప్రచారానికి నా అభినందనలు.అందరినీ ఏకం చేయాలనే మీ సందేశం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. బైడెన్ పాలనలో ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో భారత్‌- అమెరికా సహకారాన్ని మరింత పెంచాయి. ప్రజాస్వామ్య విలువలపై మన భాగస్వామ్య నిబద్ధత ఇరుదేశాలకు మార్గదర్శకంగా కొనసాగుతుంది’ అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version