BREAKING : జులై 2న విజయవాడ అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ మేరకు విజయవాడ దుర్గగుడి ఈఓ భ్రమరాంబ కీలక ప్రకటన చేశారు. దుర్గమ్మ అలయంలో జూన్ 19 నుంచి ఆషాడం మాసం సారె సంబరాలు జరుగుతాయని చెప్పారు. వైదిక కమిటీ ద్వారా తొలి సారె అమ్మవారికి ఆషాడం సారె సమర్పణ చేయవచ్చని వెల్లడించారు దుర్గగుడి ఈఓ భ్రమరాంబ.
జూలై 1 నుంచి 3 వరకు అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు ఉంటాయని.. కూరగాయలు, పండ్లు ఉత్సవాల కోసం విరాళాలు ఇవ్వచ్చని ప్రకటించారు. జులై 2న అమ్మవారికి బంగారు బోనాన్ని మహంకాళి బోనం కమిటీ వారు అందిస్తారని స్పష్టం చేశారు దుర్గగుడి ఈఓ భ్రమరాంబ. ఈ తరుణంలోనే.. భక్తులు అమ్మవారికి వేలాది సంఖ్యలో దర్శించుకోవాలని కోరారు దుర్గగుడి ఈఓ భ్రమరాంబ.