చిన్నారిపై రేప్ కేసులో విజయవాడ కోర్ట్ సంచలన తీర్పు…!

-

గత ఏడాది విజయవాడ నగర శివారుల్లోని గొల్లపూడిలో జరిగిన ఒక రేప్ ఘటన కు సంబంధించి విజయవాడ ఫోక్సో కోర్ట్ సంచలన తీర్పు వెల్లడించింది. తన ఇంటి ముందు ఆడుకునే చిన్నారి ని రేప్ చేసాడు పెంటయ్య అనే ఒక వ్యక్తి. అతనిని పట్టించి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా అతనిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఈ కేసు విచారణ పూర్తి కాగా నేడు ఫోక్సో కోర్ట్ తీర్పు వెల్లడించింది.

నిందితుడికి ఉరి శిక్ష విదిస్తున్నాము అని తీర్పు ఇచ్చింది. నేరం రుజువు కావడంతో ఈ తీర్పు వెల్లడించింది. ఈ ఘటన గత ఏడాది సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలి అంటూ డిమాండ్ లు వినిపించాయి. అతను ఏ మాత్రం కూడా సమాజంలో ఉండటానికి అర్హుడు కాదు అని అప్పుడు చాలా మంది విమర్శలు చేసారు. రాజకీయ నాయకులు కూడా అప్పుడు చిన్నారి కుటుంబానికి అండగా నిలిచారు

Read more RELATED
Recommended to you

Exit mobile version