Vijayawada Rains: వరదలో ముగినిపోయిన విజయవాడ పోలీస్ స్టేషన్ !

-

Vijayawada Rains: విజయవాడ పోలీస్ స్టేషన్ వరదలో ముగినిపోయింది. నిన్న రాత్రి నుంచి విజయవాడంలో వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నీట మునిగింది బెజవాడ. జనజీవనం స్తంభించింది. విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులైన ఏలూరు రోడ్డు నక్కల్ రోడ్డు బస్టాండ్ పరిసర ప్రాంతాలు భవానిపురం జలమయం అయ్యాయి. 11 సమయానికి కూడా దుకాణాలు తెరుచుకోలేదు.

Vijayawada Kothapet Police Station waterlogged in the wake of heavy rains

భారీ వర్షం దెబ్బకు రోడ్ల మీదకి రావడం లేదు బెజవాడ నగరవాసులు. రోడ్ల మీదకు వచ్చిన వాహనాలన్నీ వరద నీటిలో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ కొత్తపేట పోలీస్ స్టేషన్ జలమయమైంది. ఇక అటు . విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు. భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉంటుందని ముందస్తుగా విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు మూసివేశారు అధికారులు. విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు దిగువున ఇప్పటికే మూడు చెట్లు కూలిపోయాయి. ఇక ఆ చెట్లను తొలగిస్తున్నారు సిబ్బంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version