ఎలన్ మస్క్ కి భారీ షాక్.. బ్రెజిల్ లో ‘X’ నిషేదం

-

ఎలన్ మస్క్ కి భారీ షాక్ తగిలిందనే చెప్పాలి. ముఖ్యంగా బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ‘X'(ట్విట్టర్) పై నిషేదం విధించారు. ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ‘X’ ను సస్పెండ్ చేయాలని ఆదేశించారు న్యాయమూర్తి. కోర్టు ఇచ్చిన గడువు లోగా బ్రెజిల్ లోని తన చట్టపరమైన ప్రతినిధి గురించి సమాచారాన్ని అందించలేదని చెప్పారు న్యాయమూర్తి. బ్రెజిల్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అలెగ్జాండర్ డి.మోరేస్-ఎలాన్ మస్క్ మధ్య కొనసాగుతున్న వివాదంతో ఈ నిర్ణయం వచ్చింది. బ్రెజిల్ లోని శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొవైడర్ స్టార్ లింక్ ఆర్థిక ఖాతాలను స్థంబింపజేయడం కూడా ఇందులో ఉంది.

మోరెస్ దానిపై అన్ని సంబంధిత కోర్టు ఉత్తర్వులను పాటించే వరకు  బ్రెజిల్ దేశంలో ‘X’ ను తక్షణమే నిషేదించాలని ఆదేశించింది కోర్టు. అలాగే 18.5 మిలియన్ రియాస్ భారత కరెన్సీ ప్రకారం.. దాదాపు 27.66 కోట్లు జరిమానా చెల్లించాలని సూచించింది. బ్రెజిల్ లో చట్టపరమైన ప్రతినిధి నియామకం చేపట్టాలని కోరింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version