గన్నవరం నుంచి మెట్రో రాబోతోందని ప్రకటించారు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ రోడ్లను పరిశీలించారు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా.
ఈ సందర్భంగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని మాట్లాడుతూ… విజయవాడ నగరంలో లారీల ప్రవేశం కోసం ఫ్రీ జోన్ ఏర్పాటు చేయడం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి నిడమానూరు వరకు 6.3 కిలోమీటర్ల ఫ్లై ఓవర్ రాబోతోందని తెలిపారు. ప్రత్యమ్నంగా తాత్కాలిక మరియు పర్మినెంట్ రోడ్ల కోసం పరిశీలన చేస్తున్నామని ప్రకటించారు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని.