విజయవాడ వాసులకు గుడ్‌ న్యూస్‌…సిద్ధమవుతున్న పశ్చిమ బైపాస్

-

విజయవాడ వాసులకు గుడ్‌ న్యూస్‌…విజయవాడ ట్రాఫిక్ కష్టాలకు త్వరలోనే ఫుల్ స్టాప్ పడనుంది. కాజా టోల్ ప్లాజా నుంచి చిన్నఆవుటపల్లి మధ్య నిర్మిస్తున్న పశ్చిమ బైపాస్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. 48KM మేర 6 వరుసలతో నిర్మిస్తున్న ఈ బైపాస్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Vijayawada Western Bypass nearing completion

2021లో ఈ బైపాస్ పనులు మొదలవగా…. భూసేకరణలో సగం ఖర్చును ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం భరించింది. చెన్నై-కోల్కత్తా హైవేపై వెళ్లే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండా బైపాస్ నిర్మించారు.

కాగా, కాకినాడ జిల్లా అన్నవరం రైల్వే స్టేషన్ కు అరుదైన గుర్తింపు దక్కింది. FSSAI నుంచి ఈట్ రైట్ స్టేషన్ అవార్డును సొంతం చేసుకుంది. విజయవాడ డివిజన్ లో ఈ హోదా పొందిన తొలి స్టేషన్ ఇదే కాగా….జోన్ లో నాంపల్లి తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. స్టేషన్ లోని అన్ని క్యాటరింగ్ స్టాల్స్ లో ఆహార భద్రత, పరిశుభ్రత, విక్రేత వ్యక్తిగత శుభ్రత, ఫుడ్ గడువు తేదీలు, వ్యర్ధాల తొలగింపు వంటివి పరిగణలోకి తీసుకొని అవార్డు అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version