కాంగ్రెస్‌లో చేరనున్న అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

-

బీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగులనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గులాబీ పార్టీకి చెందిన కీలక నేతలందరూ పార్టీ మారుతున్నారు. అధికారంలోకి కాంగ్రెస్ లోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలాగే మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో… కాంగ్రెస్ టికెట్లు ఆశించి కూడా కొంతమంది బయటకు వెళ్తున్నారు.

Allu Arjun’s uncle Kancharla Chandrasekhar Reddy will join the Congress

ఇక తాజాగా కాంగ్రెస్‌లో చేరనున్నారు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ రెడ్డికి మల్కాజ్‌గిరి కాంగ్రెస్ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలోనే.. అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఇక అటు  బీఆర్‌ఎస్‌ పార్టీకి ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌ రెడ్డి సతీమణీ సునీత మహేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్‌ కు రాజీనామా లేఖ పంపారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version