పాకిస్తాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా గుట్టురట్టు ఐంది. సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఓ విశాఖ వాసి. మృతుడి వాట్సప్ చాట్ ద్వారా పాకిస్థానీ ఐపీ అడ్రస్ ను గుర్తించారు పోలీసులు.

అస్సాం, గుజరాత్ కు చెందిన బ్యాంక్ ఖాతాల నుంచి లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. 16 మంది లోన్ యాప్ నిందితులను అరెస్టు చేసారూ విశాఖ పోలీసులు. లోన్ యాప్ ద్వారా అమాయకులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు విశాఖ సిపి శంఖభ్రత భాగ్చి. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.