కాకినాడలోని అన్నవరం దేవాలయానికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. అన్నవరంలో వాట్స్అప్ ద్వారా వ్రతాలు అలాగే దర్శన సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఆలయ కమిటీ. దీనికోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కూడా ఏర్పాటు చేసింది ఆలయ కమిటీ. 9552300009 అనే ఫోన్ నెంబర్ కు హాయ్ అని టైప్ చేస్తే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్స్… చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు.
అనంతరం వ్రతానికి సంబంధించిన టికెట్లు అలాగే దర్శనం టికెట్లను పొందవచ్చు. సత్యనారాయణ స్వామి వ్రతాలు అలాగే దర్శనాలతో పాటు… దేవాలయానికి విరాళాలు కూడా ఈ నెంబర్ ద్వారా… పంపించవచ్చు. దాతలు చాలామంది ఉంటారు. కాబట్టి సత్యనారాయణ స్వామి దేవాలయానికి… విరాళం ఇవ్వాలనుకుంటే… హాయ్ అని ఎస్ఎంఎస్ పెడితే చాలు… ఆ తర్వాత మనం చేయాల్సిన విరాళం ఈయవచ్చు. కాగా ప్రస్తుతం అన్నవరం దేవాలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి దగ్గరికి వస్తున్న నేపథ్యంలో… భక్తులందరూ సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటున్నారు.