పవన్ కళ్యాణ్ చేద్దామనుకున్న పని గురించే ఫ్లెక్సీలో చెప్పాం – మంత్రి అమర్నాథ్

-

జనసేన – వైసీపీ ఫ్లెక్సీ వివాదం పై స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నమాట అంటే ఉలుకెందుకని పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ టిడిపి సీనియర్ కార్యకర్త అని ఎద్దేవా చేశారు. సీనియర్ పార్టీ కార్యకర్త అంటే జెండా పట్టుకుని తిరగాలి కానీ.. ఏదైనా అంటే కోప్పడకూడదని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు పల్లకి మోసేందుకే ఉన్నాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ చేద్దామనుకున్న పని గురించే తాము ఫ్లెక్సీలో చెప్పామని పేర్కొన్నారు.

టిడిపి తో తమకు సంబంధం లేదంటే జనసేన 175 స్థానాలలో పోటీ చేయాలని సవాల్ విసిరారు మంత్రి అమర్నాథ్. ఇక టిడిపి మేనిఫెస్టో గురించి స్పందిస్తూ.. చంద్రబాబు ఏ మేనిఫెస్టో తీసుకువచ్చినా ప్రజలు నమ్మరని అన్నారు. సీఎం జగన్ అంటే నిజం.. చంద్రబాబు అంటే అబద్ధం అని విమర్శించారు. వినేవాడు ఉంటే చంద్రబాబు 5 కేజీల బంగారం, 10 కేజీల వెండి ఇస్తానంటాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version