మనిషి నిద్రపోతున్నప్పుడు కలలు కనడం సహజం.. కలలో ఏమైనా రావొచ్చు.. కొన్ని కలలు గుర్తుంటాయి.. కొన్ని తెల్లారేసరికి మర్చిపోతాం. కలలో ఏవేవో వస్తువులు, మనుషులు కనిపిస్తాయి.. నిజానికి కలలో కనిపించే ప్రతే వస్తువుకు ఒక అర్థం ఉంటుంది. మీ భవిష్యత్తుకు సంబంధించే ఏదో సంకేతాన్ని కలలో రూపంలో కాలం మనకు అందిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీకు కలలో మామిడి పండు తిన్నట్లు ఎప్పుడైనా వచ్చిందా..? పండ్లు కలలో కనిపించడం నిజానికి శుభశకునమే.. అయితే అన్ని పండ్లు కాదు.. అసలు కలలో మామిడి పండు తిన్నట్లు వస్తే దాని అర్థం ఏంటో చూద్దామా..!
మామిడి పండు తింటున్నట్లు
మామిడి పండు తినడం ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు.. దాదాపు అందరికీ మామిడి ఇష్టమైన పండు. మామిడి పండు తింటున్నట్టు కలలో కనిపిస్తే మీకు త్వరలో చాలా డబ్బు రాబోతోందని అర్థం. అయాచితంగా మీకు సంపద లభిస్తుందని అర్థం.
పచ్చి మామిడి తింటుంటే
కలలో పచ్చిమామిడి తింటున్నట్టు వస్తే మీ కష్టానికి తగిన ఫలితం త్వరలో అందబోతోందని అర్థం. మీరు ఆశించినది త్వరలో మీకు అందుతుందని ఈ కల సంకేతం.
మామిడి పండు రాలుతున్నట్లు
చెట్టు నుంచి పండ్లు రాలుతూనే ఉంటాయి. మామిడి చెట్టు నుంచి పండు రాలుతున్నట్టు కలలో కనిపిస్తే మాత్రం మీరు ఎదురు చూస్తున్న పరీక్షా ఫలితాలు చాలా అనుకూలంగా వస్తాయని అర్థమట… మీరు రాసిన పరీక్షల్లో విజయం సాధిస్తారు. లేదా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే ఆ ప్రయత్నం సఫలం అవుతుంది.
మామిడి కాయ కోస్తున్నట్టు
మామిడి పండ్లను కోస్తున్నట్టు కల వచ్చే కష్టానికి తగిన ఫలితాలు లభిస్తాయని అర్థమట.. ఒక లక్ష్యం కోసం ప్రయత్నిస్తుంటే తప్పకుండా ఆ లక్ష్యాన్ని చేధిస్తారు.
ఇలా ఏ రకంగా మామిడి మీ కలలో కనిపించినా అది మీకు శుభశకునమే అని స్వప్న శాస్త్రం చెబుతుంది.. మామిడి నిజ జీవితంలోనే కాదు.. కలలో కనిపించినా మనకు శుభమే అనమాట..!