ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం విషయంలో కేంద్ర నాయకత్వం కూడా చాలా ఆసక్తికరంగా గమనిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనే దానిపై కేంద్ర నాయకత్వం కాస్త ఇక్కడున్న సమాచారాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో బిజెపి నేతలు గత రెండేళ్ల నుంచి ఎంతవరకు కష్టపడ్డారు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఎంత వరకు పోరాటం చేశారు అనే అంశాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలు కాస్త గట్టిగానే ఆరాతీస్తున్నారు.
కొంతమంది నేతలు అలసత్వం ప్రదర్శించడంతో పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడుతుంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ప్రతిపక్షంగా ఎదగడానికి ఇది మంచి సమయం అవుతుంది. కాబట్టి ప్రజా ఉద్యమాలను బలంగా చేయాలి. ప్రజల్లోకి వెళ్లే విధంగా వ్యాఖ్యలు చేయాలి.
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి. నేతలతో ఎప్పటికిప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఉండాలి. జనసేన పార్టీతో కలిసి వెళ్తున్నారు కాబట్టి ఆ పార్టీ నేతలతో కలిసి కార్యక్రమాలు చేయాలి. నిరసన కార్యక్రమాలు ఎక్కువగా ఉండాలి. మీడియాలో ఎక్కువగా కనబడే విధంగా పోరాటాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నేతలు అలాంటి ప్రయత్నాలు చేయలేకపోవడంతో కేంద్ర నాయకత్వం కూడా ఇబ్బంది పడుతుందని అంటున్నారు. అందుకే రాష్ట్ర నాయకత్వం లో కొన్ని కీలక మార్పులు చేయడానికి కేంద్ర నాయకత్వం సిద్ధమవుతుందని సమాచారం. తిరుపతి ఎన్నికల తర్వాత కీలక మార్పులు ఉండవచ్చు.