ఏపీ ముఖ్యమంత్రి జగన్ దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదని అన్నారు బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి. భారీగా ఖర్చు పెట్టి దావోస్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు. దేవాలయాల ఆస్తులపై ప్రభుత్వానిదే నిర్ణయం అని ఒక మంత్రి అనడం దారుణమని అన్నారు. మసీదుల్లో మౌజన్లకు, ఫాస్టర్ లకు డబ్బులు ఇస్తూ దేవాలయంలో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని ప్రశ్నించారు విష్ణువర్ధన్.
బీజేపీ అధికారంలోకి వస్తే చర్చిలు, మసీదుల మాదిరిగా దేవాలయాలను కూడా స్వేచ్ఛగా ఉంచుతామన్నారు. ఇక గ్రూప్-1 పరీక్షల అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని.. దీనిపై గవర్నర్ కు లేఖ రాస్తామని చెప్పారు. అవినీతిపై ఫిర్యాదులకు యాప్ ప్రవేశ పెడుతుండడం పై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల అవినీతి తోనే దాన్ని మొదలు పెట్టాలని అన్నారు.