AP: జూన్ 3, 4, 5 తేదీల్లో ఏపీలో వైన్స్ బంద్ !

-

Wine shops closed: ఏపీ మందుబాబులకు అలర్ట్‌. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉండనుంది. ఈ మేరకు ఏపీ పోలీసులు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక తాజాగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ ఇదే విషయంపై కీలక ప్రకటన చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.

Wine shops closed on june 3 4 5 on occasion of andhra pradesh elections 2024 result

జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్ లకు ఆదేశాలు ఇచ్చారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలనూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు ఎస్పీ పి జగదీష్.

Read more RELATED
Recommended to you

Latest news