Woman dies while undergoing MRI scan: ఏలూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తుండా మహిళ మృతి చెందారు. తలలో ఇబ్బంది తలెత్తడంతో తన భార్య రామతులసిని ఏలూరులోని సుస్మిత డయాగ్నస్టిక్ సెంటర్ తరలించారు భర్త కోటీశ్వరరావు. తన భార్యను పరశీలించిన వైద్యులు ఎంఆర్ఐ చేయాలంటే ఒకే చెప్పామన్నారు అని సమాచారం.
అయితే, ఎంఆర్ఐ చేస్తుండగా.. తన భార్య గిలగిల కొట్టుకున్న.. పట్టించుకోలేదని, కదలితే స్కానింగ్ సరిగా రాదని చప్పారంటూ భర్త వాపోయాడు. తన కళ్లముందే భార్య చనిపోయిందంటూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.