దేశ ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ మహాకుంభమేళకు… ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళబోతున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పవిత్ర త్రివేణి సంఘంలో అమృత స్నానం… చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రంగం సిద్ధం చేసుకున్నారు. ఇవాళ సాయంత్రం నాలుగు గంటల లోపు కుంభమేళకు ప్రధాని నరేంద్ర మోడీ చేరుకోనున్నారు.
ఈ సందర్భంగా.. మహా కుంభమేళ వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. అటు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో.. ఈరోజు భక్తులు మళ్లీ విపరీతంగా వచ్చే అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా… అటు సామాన్యులు కూడా పవిత్ర స్నానం చేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తుంది యోగి సర్కార్. ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో సీఎం యోగి కూడా ఆయనతో పాటు అమృత స్నానం చేయబోతున్నారు.