టిడిపి నేత యనమల రామకృష్ణుడుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత యనమల కృష్ణుడు. టిడిపి నేత యనమల రామకృష్ణుడుకు ఆయన తమ్ముడు, వైసీపీ నేత కృష్ణుడు సవాల్ కూడా విసిరారు. నీకు దమ్ము, సత్తా ఉంటే అని నాపై కేసులు పెట్టాలని ఛాలెంజ్ చేశారు వైసీపీ నేత యనమల కృష్ణుడు. నీతో పాటు 40 ఏళ్ళు రాజకీయాలు చేశాను.. ఇలాంటి చౌకబారు రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని ఫైర్ అయ్యారు.

వైసీపీ నేతలపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రతిపక్షంలో ఉన్నానని చులకనగా చూడొద్దని వార్నింగ్ ఇచ్చారు వైసీపీ నేత యనమల కృష్ణుడు.