సీఎం జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జరిగిన లబ్ధిని వివరించేందుకు వైసిపి ప్రారంభించిన సామాజిక సాధికార యాత్ర రెండోదశ ఇవాళ ప్రారంభం కానుంది. నేడు నరసన్నపేట, పొన్నూరు, హిందూపురం నియోజకవర్గాల్లో యాత్ర సాగుతుంది. దీంతో స్థానిక నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30 వరకు 39 ప్రాంతాల్లో మంత్రులు, సీనియర్ నేతలు సభలు నిర్వహిస్తారు. తొలి దశలో 35 నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉండగా.. సీఎం జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు రూ. 340.26 కోట్లతో నిర్మించబోయే వరికపూడిశెల ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేస్తారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో తాడేపల్లి నుంచి బయలుదేరి మాచర్ల చేరుకుంటారు. శంకుస్థాపన అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో ప్రసంగిస్తారు. కాగా, తొలి దశలో భాగంగా పైప్డ్ ఇరిగేషన్ పద్ధతిలో 24,900 ఎకరాలకు నీళ్లు అందించేలా పనులు చేపట్టనున్నారు.