శ్రీలంక స్టార్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా 800. ఈ చిత్రం అక్టోబర్ 6వ తేదీ థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్ల నుంచి వెళ్లిపోయాక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పెడుతూ ఈ బయోపిక్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమా జియో సినిమా వేదికగా డిసెంబర్ 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషలతో పాటు సింహళ భాషలోనూ ఇది ప్రసారం కానున్నట్లు జియో సినిమా వెల్లడించింది. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మధుర్ మిత్తల్, మహిమా నంబియార్, నరేన్ కీలక పాత్రల్లో నటించారు.
800 స్టోరీ ఏంటంటే.. : తేయాకు తోటల్లో పనిచేస్తున్న తమిళ కుటుంబంలో జన్మించిన ముత్తయ్య మురళీధరన్ కుటుంబం.. శ్రీలంకలోని కాండీలో బిస్కెట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తుంది. సింహళం మాట్లాడే వర్గం… తమిళం మాట్లాడే వర్గాల మధ్య 70వ దశకంలో ఘర్షణలు చెలరేగడంతో.. ముత్తయ్య కుటుంబం ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని దూరంగా వెళ్లి తలదాచుకుంటుంది. ఘర్షణల ప్రభావం తన బిడ్డపై పడకూడదని ముత్తయ్య తల్లిదండ్రులు ఏం చేశారు? ముత్తయ్యకి క్రికెట్‌పై ఆసక్తి ఎలా ఏర్పడింది? తను శ్రీలంక జట్టులో ఎలా చోటు సంపాదించాడు? ఎలాంటి అవమానాల్ని, సవాళ్లని ఎదుర్కొని ఆటగాడిగా తన ప్రస్థానం కొనసాగింది ఆయన 800 వికెట్ల ప్రయాణం ఎలా సాగిందో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.