ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు మాకుందని వైసీపీ దేవినేని అవినాష్ అన్నారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమని.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు వైసీపీ తూర్పు ఇంఛార్జి దేవినేని అవినాష్. ఎన్టీఆర్ లలితకళా అవార్డును పోసానికి ఇస్తున్నామని.. టీడీపీ నేతలు అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేరు కూడా ప్రస్తావన రాకుండా చేసేవారని వివరించారు.
ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టి నేత జగన్ అని వెల్లడించారు. ఎన్టీఆర్ విగ్రహం దగ్గర వైసీపీ ఫ్లెక్సీలపై దేవినేని అవినాష్ స్పందించారు. మేమూ కూడా ఎన్టీఆర్ అభిమానులమే… ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు మాకుంది.. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి రాసివ్వలేదు … అది వాళ్ల పార్టీ ఆఫీసూ కాదన్నారు. మేం బ్యానర్లు కట్టే వరకూ అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరని.. వారి ప్రవర్తన చాలా బాధగా అనిపించిందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు… కవ్వింపు చర్యలు… అల్లర్లను ప్రోత్సహించే విధానం మానుకోవాలని గద్దె నీ హెచ్చరిస్తున్నానని ఫైర్ అయ్యారు.