BREAKING: ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం

-

ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభం కానుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కట్టకట్టుకుని వచ్చినా..ఏం పీకలేరన్నారు. సిద్ధం సభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ….ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందన్నారు. 14 లేదా 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని వివరించారు. బిజెపి ,జనసేన, టిడిపి ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన వైసీపీకి నష్టం లేదు…అసలు టిడిపికి ఒక రాజకీయ సిద్ధాంతం లేదని ఫైర్‌ అయ్యారు.

YCP election campaign from 16th of this month

ఈ దేశంలో ఒక వైసీపీతో తప్ప చంద్రబాబు ప్రతి పార్టీతోనూ పొత్తు పెట్టుకున్నాడు..అధికార దాహం తప్ప రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుకు పట్టదని విమర్శలు చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం ఓట్లు వచ్చాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు. టిడిపి ,జనసేన ,బిజెపి మొత్తం కట్టకట్టుకుని వచ్చిన 46 శాతానికి మించలేదు, మించవన్నారు. మళ్లీ మరోసారి ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కడతారని స్పష్టం చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version