దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసమే పొత్తులు – పురంధేశ్వరి

-

దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసమే పొత్తులు అని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి పేర్కొన్నారు. పొత్తులపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంది…టీడీపీ – జనసేన పార్టీలతో పొత్తు ఏర్పడ్డం సంతోషమని వివరించారు. బీజేపీ ప్రచార రధాలు ప్రారంభించారు బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి. మేనిఫెస్టో రూపకల్పన కోసం అభిప్రాయ సేకరణ చేపట్టనుంది బీజేపీ.

Daggupati purandeshwari speaks about allaiances

తొమ్మిది జిల్లాలకు మేనిఫెస్టో రధాలను పంపుతోంది బీజేపీ. ఈ సందర్భంగా బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి మాట్లాడుతూ….ఏ సీటు.. ఎన్ని సీట్లు అనేది ఒకట్రొండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసమే పొత్తులు అన్నారు. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు అన్నింటినీ అర్థం చేసుకుంటారు..? రాముల వారికి ఉడుత సాయం కూడా అవసరమైందని చెప్పారు. ఏపీలో జరుగుతున్న అరాచకాల అంతానికి అందరూ కలవాల్సిన అవసరం ఉందని వివరించారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version