TDP రాక్షసానందానికి ఇంకెంత మంది బలి కావాలి ? – పల్నాడు హత్య పై వైసీపీ ఫైర్

-

TDP రాక్షసానందానికి ఇంకెంత మంది బలి కావాలి ? అంటూ పల్నాడు హత్య పై వైసీపీ ఫైర్ అయింది. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణం చోటు చేసుకుంది. అందరు చూస్తుండగానే వైఎస్సార్సీపీ కార్యకర్తను నరికి టీడీపీ కార్యకర్త చంపాడు. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నాయకుడు రషీద్ పై కత్తితో దాడి చేసి చంపారు జిలానీ అనే టీడీపీ కార్యకర్త.

రషీద్ రెండు చేతులు నరికి మెడ పై కత్తితో దాడి చేసాడు టీడీపీ కార్యకర్త. ఇక ఈ సంఘటన పై వైసీపీ రియాక్ట్ అయింది. పల్నాడులో నరరూప రాక్షసుల్లా మారి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తని టీడీపీ గూండా జిలానీ చంపేసాడని వైసీపీ ఆరోపణలు చేసింది. వినుకొండ వైయస్‌ఆర్‌సీపీ యువజన విభాగం నాయకుడు రషీద్‌పై పాశవికంగా కత్తితో దాడి చేసాడని తెలిపింది వైసీపీ.

దారుణంగా రెండు చేతులు నరికి, మెడపై కూడా వేటు వేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రషీద్‌ మృతి చెందినట్లు తెలిపింది. మీ TDP వాళ్ల రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలి హోం మంత్రి అనిత, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు దేశంలో మరీ ఇంత నీచమైన కక్ష సాధింపు రాజకీయాలు ఎవరైనా చేస్తారా ?అంటూ ట్వీట్ చేసింది వైసీపీ.

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version