చీకటి తర్వాత వెలుగు రాక మానదు.. పలానావాడు మన నాయకుడు అని చెప్పుకునే రీతిలో మనం ఉండాలి అని మాజీ సీఎం జగన్ అన్నారు. జగన్ గురించి మాట్లాడితే ఎవరిని అడిగినా.. పలావు పెట్టాడు అంటారు. అదే చంద్రబాబు గురించి అడిగితే.. బిర్యానీ పెడతానని మోసం చేశాడని అంటున్నారు అని పేర్కొన్నారు. ఇప్పుడు పలావు పోయింది.. బిర్యానీ పోయింది. స్కూళ్లు, ఆస్పత్రులను నిర్వీర్యం చేస్తున్నారు. రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు.
గడపవద్దకే మనం సేవలు అందిస్తే ఇప్పుడు టీడీపీ నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అని తెలిపారు. పాలన దెబ్బతింది, లా అండ్ ఆర్డర్ దెబ్బతింది, వ్యవసాయం దెబ్బతింది. చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలు, మోసాలని తేలిపోతున్నాయి. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే అమ్మ ఒడి, రైతుభరోసా, విద్యాదీవెన, వసతి దీవెన, సున్నావడ్డీ, మత్స్యకార భరోసా అంది ఉండేది. మీ జగన్ సీఎంగా ఉండి ఉంటే.. కాలెండర్ ప్రకారం పథకాలు వచ్చేవి. ప్రస్తుతం వచ్చిన తేడాను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలకు మనం దగ్గరంగా ఉంటే చాలు. ఆ ప్రజలే చంద్రబాబును నామరూపాల్లేకుండా చేసే పరిస్థితి వస్తుంది అని వైసీపీ అధినేత జగన్ అన్నారు.