ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై పాము విసిరిన మహిళ.. ఎందుకంటే..?

-

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు అమలు నుండి మనం.. ఆర్టీసీకి సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వింటూనే ఉన్నాము. అయితే ఈ రోజు హైదరాబాద్ నల్లకుంట విద్యా నగర్ లో ఓ వింత ఘటన జరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పైకి పాము విసిరింది ఓ మహిళ. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యా నగర్ వద్ద మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసింది ఓ మహిళ.

కానీ డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడు. దాంతో ఆగ్రహంకి గురైన మహిళా బస్సు పై బీర్ బాటిల్ తో దాడి చేసింది. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం ధ్వంసం అయ్యింది. ఆ కారణంగా బస్సు ఆపి డ్రైవర్ మహిళను పట్టుకునే ప్రయత్నం చేయగా… బస్సు డ్రైవర్ పైకి తన వద్ద ఉన్న పామును విసిరింది సదరు మహిళ. ఇక భయంతో ఖంగుతిని అక్కడి నుండి పారిపోయిన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. అయితే ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version