వైసీపీ నేతలు బ్రిటిష్ వారి కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారు – సోమిరెడ్డి

-

నెల్లూరు జిల్లా: వైసిపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కోట, చిల్లకూరు మండలాల్లో సిలికా మైనింగ్ మాఫియా రెచ్చిపోతోందన్నారు. మైనింగ్ చట్టాలు వైసీపీ పెద్ద రెడ్ల కాళ్ళ కింద నలిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. 76 మంది లీజు దారులున్నారని.. వైసీపీ బినామీలు టన్ను సిలికా ను రూ.1450 కి అమ్ముకుంటూ లీజు ఓనర్లకు 100 రూపాయలు ఇవ్వడం దారుణం అన్నారు. ప్రభుత్వ భూముల్లో ఎప్పటి నుంచో వేరు సేనగ పండించుకునే రైతుల నుంచి భూములు లాక్కొని వారికి టన్నుకు 20 రూపాయలు ఇవ్వడం దుర్మార్గం అన్నారు.

వైసిపి నేతలు బ్రిటిష్ వారి కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు సోమిరెడ్డి. ఎంతోమంది లీజు హోల్డర్లు వున్నా.. అక్రమాలు చేసేది మాత్రం వైసీపీకి చెందిన నలుగురు బినామీ వ్యక్తులేనని ఆరోపించారు. వైసీపీ బినామీ వ్యక్తులు నాలుగు రకాల కంపెనీలు పేర్లతో యార్డులు పెట్టుకొని బహిరంగంగా దోపిడీ చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. దీన్ని ఇంతటితో వదిలి పెట్టమని.. గూగుల్ మ్యాప్ పాయింటింగ్ తెచ్చి సిలికా మైనింగ్ మాఫియా అంతు చూస్తామని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version