కార్టూన్లు వేసినా కేసులు పెడుతున్నారు : మనోహర్ రెడ్డి

-

వైసీపి సోషల్ మీడియాపై ప్రభుత్వం కక్ష కట్టి కేసులు పెడుతోంది. కృష్ణా జిల్లాలో నిన్న ఒక్కరోజే 42 కేసులు పెట్టారు. వరదల్లో జరిగిన అక్రమాలపై ప్రశ్నించారని కేసులు పెడుతున్నారు అని వైసీపి లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్ రెడ్డి అన్నారు. మంచిపనుల మీద గత ప్రభుత్వాలు డ్రైవ్ చేసేవి. కానీ కూటమి ప్రభుత్వం ప్రత్యర్థులపై కేసులు పెట్టటానికి డ్రైవ్ చేస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కూడా పక్కనపెట్టి పోలీసులు వ్యవహరిస్తున్నారు. డీజీపి ద్వారకాతిరుమలరావు అనంతపురం జిల్లాలో ఏఎస్పీగా పని చేసినప్పుడు ఎంతో మంచి పేరు ఉంది. అలాంటి వ్యక్తేనా ఇప్పుడు డీజీపిగా పని చేస్తున్నదీ? అని అనిపిస్తోంది.

ప్రభుత్వ పెద్దల మాటలు విని వ్యవస్థను భ్రష్టు పట్టించవద్దు. డిపార్ట్మెంట్ ను నిర్వీర్యం చేయవద్దని కోరుతున్నాం. 41a నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టులు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వటం లేదు. నాలగైదు స్టేషన్లు తిప్పి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అధికార కూటమికి తలొంచి అక్రమ కేసులు పెడితే ప్రయివేటు కేసులు వేస్తాం. ప్రభుత్వం ఇచ్చిన లెక్కలతో కార్టూన్లు వేసినా కేసులు పెడుతున్నారు. టీవీల్లో వచ్చే వార్తలను పోస్టు చేసినా కూడా కేసులు పెట్టటం ఏంటి అని మనోహర్ రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version