జనసేన కార్యాలయానికి వైసీపీ ప్లెక్సీలు.. మచిలీపట్నంలో ఉద్రిక్తత

-

ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ప్లెక్సీల మధ్య వివాదం కొనసాగుతుంది. తాజాగా కృష్ణాజిల్లా మచిలీపట్నంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష జనసేన పార్టీల మధ్య ప్లెక్సీ వివాదం జరిగింది. మేయర్ ఎన్నిక సందర్భంగా జనసేన కార్యాలయానికి వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో వివాదానికి దారి తీసింది. జనసేన నాయకులు ప్లెక్సీని తొలగించడంతో వైసీపీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. 

మచిలీపట్నం మేయర్ గా చిటికిన వెంకటేశ్వరమ్మ ఎన్నికయ్యారు. కౌన్సిల్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రాజబాబు నూతన మేయర్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకు ముందు వైసీపీ నాయకులు, కార్యకర్తలు మచిలీ పట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన రోడ్లలో నూతన మేయర్ కి శుభాకాంక్షలు తెలుపుతూ ప్లెక్సీలు వెలిశాయి. ఇలా జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయానికి కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇలా జనసేన నాయకుడు కొరియర్ శ్రీను కార్యాలయానికి కూడా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version