నారా లోకేష్ టాయ్‌లెట్లు క్లీన్ చేశాడా అంటూ గీతాంజలి మరణంపై వైసీపీ ట్వీట్ చేసింది. గీతాంజలి విషయంలో టీడీపీ వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ పార్టీలో ఉన్నవారు ఎంత నీతిమాలిన వ్యక్తులో అర్థమవుతుందన్నారు. మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరూ ఇలా చనిపోయిన వ్యక్తిపై ఇంతలా దుష్ప్రచారం చేయరని ఆగ్రహించారు.
గీతాంజలి తరచూ వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా కార్యాలయానికి వచ్చేదని తప్పుడు రాతలు రాస్తున్నారు… ఎవడు చెప్పాడు? నారా లోకేష్ మారువేషంలో టాయ్‌లెట్లు క్లీన్ చేయడానికి వచ్చి చూశాడా? లేక iTDP వర్కర్లు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్‌లు క్లీన్ చేయడానికి వచ్చినప్పుడు చూశారా? సిగ్గులేని బతుకులు అంటూ వైసీపీ పార్టీ సీరియస్ అయింది.
సోషల్ మీడియాలో టీడీపీ చేసిన దారుణమైన ట్రోలింగ్ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇద్దరు చిన్నారులు తల్లిలేని వారయ్యారు. అయినా కొంచెం కూడా బాధ లేకుండా గీతాంజలిపై దుష్ప్రచారాలు చేస్తూ ఆమె కుటుంబాన్ని మానసికంగా హింసిస్తున్నారని ఆగ్రహించింది వైసీపీ. పచ్చమంద మొత్తానివి తప్పుడు పుట్టుకలు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారు. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్కరు గమనిస్తున్నారు, ఇంత దారుణానికి పాల్పడిన టీడీపీ కి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించింది.