నేడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు. అయితే ఆయన పుట్టినరోజు వేడుకలను ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి వైసిపి శ్రేణులు. అలాగే సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ నేతల వరకు వైయస్ జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ, జనసేన నేత నాగబాబు ఇలా చాలామంది మాజీమంత్రి జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ ని పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సభ్యుల రామకృష్ణారెడ్డి కట్ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు.
అయితే తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ఎక్స్ ( ట్విట్టర్) వేదికగా కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు మాజీ సీఎం జగన్. ” పుట్టినరోజు సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ.. అలాగే పలు కార్యక్రమాలు నిర్వహించిన వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా ప్రతి అడుగులో నాకు తోడుగా ఉండి, నన్ను నడిపిస్తూ వెలకట్టలేని అభిమానాన్ని చూపిస్తున్న వైసీపీ కుటుంబ సభ్యుల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది” అని ట్వీట్ చేశారు.