BREAKING : ABN రిపోర్టర్ పై వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల దాడి

-

BREAKING : ABN రిపోర్టర్ పై వైఎస్ అవినాష్ రెడ్డి అనుచరుల దాడి చేశారు. సీబీఐ విచారణకు హాజరు కాకుండా పులివెందుల వైపు వెళ్తున్న అవినాష్ రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న ఏబీఎన్ వాహనం ముందు వైపు అద్దాలు పగలగొట్టి రిపోర్టర్ శశి పై దాడి చేశారు అవినాష్ అనుచరులు. అయితే ఈ సంఘటనపై కింజరాపు అచ్చెన్నాయుడు స్పందించారు.

సీబీఐ విచారణకు హాజరుకాకుండా కుంటి సాకులు చెప్పి పారిపోతున్న అవినాష్ రెడ్డి బాగోతాన్ని కవర్ చేస్తున్న ఏబీఎన్ ప్రతినిధులపై వైసీపీ రౌడీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు కింజరాపు అచ్చెన్నాయుడు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధిలపై దాడి చేసిన వైసీపీ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రికా స్వేచ్చను హరిస్తూనే ఉన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న పత్రికలపై జగన్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడంతోపాటు తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు కింజరాపు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version