వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను రక్షిస్తామని వైఎస్ జగన్ చెప్పారు అని సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు. అయితే జూలై 1, 2024 కు ముందు జరిగిన ఘటనలకు సెక్షన్ 111 వర్తించదు. కానీ ఈ సెక్షన్ 111 ను టీడీపీ దుర్వినియోగం చేస్తోంది. సోషల్ మీడియా కార్యకర్తలు ఈ చట్టం కిందకి రారు. కానీ కొన్ని వేల మంది పై అక్రమంగా కేసులు పెట్టారు అని ఆయన అన్నారు.
ఇక సజ్జల భార్గవ కు అరెస్టు నుంచి రెండు వారాల రక్షణ కల్పించారు. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ఇచ్చింది. ఘోరమైన నేరాలకు పాల్పడేవారికీ ఇది 111 వర్తింపజేయాలని శాసన కర్తల ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశాలకు వ్యతిరేకంగా అక్రమ కేసులు పెడుతున్నారు. అలాగే ఒకే ఘటనపై మల్టిపుల్ FIRలు పెట్టొద్దని గతంలోనే సుప్రీం కోర్టు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. సుప్రీం తీర్పు ఉల్లంఘిస్తే అధికారులు కూడా శిక్షకు అర్హులే అని సుధాకర్ రెడ్డి తెలిపారు.