చెల్లెళ్లతో అన్న నవ్వుల రారాజు
నిండు చందురుడు జగనన్న
అంటూ ఆనందోత్సాహాలు నింపుకుంటూ..
హృదయంలో అన్నయ్య స్థానం స్థిరం చేస్తూ..
నిన్నటి వేళ రోజా మరియు ఇంకొందరు..
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా స్త్రీలకు ప్రత్యేక గౌరవం ఇస్తుంటారు.తన పార్టీ తరుపున 15 మంది మహిళలను ఎమ్మెల్యేలుగా గెలిపించారు.నలుగురు మహిళలకు ఎమ్మెల్సీలు కట్టబెట్టారు.మన రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు,నామినేటెడ్ కాంట్రాక్టర్లలో మహిళలకే కేటాయించాలని..ఏకంగా చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వమే.కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్లు వీటిలో చట్టం చేసి మహిళలకు ఏకంగా 51 శాతం పదవులు ఇచ్చిన ఘనత జగన్ కే దక్కుతుంది.
ఆ విధంగా జగన్ మహిళలకు పెద్ద పీట వేశారు.ఎప్పుడు మాట్లాడినా..మహిళలను అక్కచెల్లెమ్మలుగా సంబోధిస్తుం టారు సీఎం జగన్.మహిళలకు తన కేబినెట్ లో చాలా ప్రాాధాన్యత ఇచ్చారు. హెంమంత్రిగా సుచరితను, డిప్యూటీ సీఎంగా పుష్ప శ్రీవాణిని నియమించి మహిళలకు పెద్ద పీట వేశారు.తల్లులకు ‘జగన్నఅమ్మ ఒడి’ పథకం తీసుకువచ్చారు.మహిళల భద్రతకు పోలీస్ వ్యవస్థను పటిష్టపరచడంతో పాటు దిశ చట్టాన్ని తీసుకువచ్చారు.
ఇదే సమయంలో/ఇదే సందర్భంలో మహిళా ఎమ్మెల్యేలు కూడా జగన్ పట్ల ఓ అన్న భావనను కనబరుస్తుంటారు.అసెంబ్లీలో సైతం జగనన్న అంటూ సంబోధిస్తుంటారు.రాఖీ పండగ సమయంలో సీఎం జగన్ కు రాఖీలు కడుతుంటారు.జగన్ విషయమై వాళ్లకు ఉన్న అమిత సోదరభావాన్ని ఎప్పటికప్పుడు ప్రదర్శిస్తుంటారు.ప్రత్యేకత చాటుకుంటారు.నిన్నటి వేళ విమెన్స్ డే సందర్భంగా..మహిళా ప్రతినిధులతో సీఎ జగన్ దిగిన సెల్ఫీ ఫోటో వైరల్ అవుతోంది.జగన్ మోహన్ రెడ్డితో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణితో పాటు ఎమ్మెల్యే రోజా, ఇతర మహిళా ఎమ్మెల్యేలు కనిపిస్తున్నారు.ఈ ఫొటో ప్రస్తుతం వైరల్ కావడంతో చెల్లెమ్మలతో సీఎం జగన్ అంటూ పలువురు వైసీపీ అభిమానులు సంబరపడుతున్నారు.
– మోహన్ బాబు
– మన లోకం ప్రత్యేకం